ఆగస్టు 9-14
తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు
ఖాళీగా ఉన్న 16,208 సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలను ఆగస్టు 9-14వ తేదీ మధ్య నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పరీక్షల
నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల కోసం పంచాయతీరాజ్ శాఖ
షెడ్యూల్‌ను రూపొందించి తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. గ్రామ వార్డు
సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 19 రకాల పోస్టుల భర్తీకి జనవరిలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వేరు , వేరు నోటిఫికేషన్లు జారీ
చేయగా వీటికి 11.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
రాత పరీక్షల
సమయంలోఒక్కో గదిలో 16 లేదా 24 మంది
అభ్యర్థులు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆగస్టు రెండో వారంలో రాత పరీక్షలు
జరిగే అవకాశం ఉందని ధరఖాస్తుదారులు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి
గోపాలకృష్ణ ద్వివేది వెయిట్ ట్వీట్ చేశారు. పూర్తిస్థాయి షెడ్యూల్ ను త్వరలో
వెల్లడిస్తామన్నారు.
0 Komentar