Health benefits
of ginger in Telugu
అల్లం వలన కలిగే ఆరోగ్య
ప్రయోజనాలు
ఆసియా దేశాల్లో
చేసే చాలా వంటకాల్లో అల్లం ను ఎక్కువగా వాడతారు. ఇది మంచి ఔషధంగా కూడా
పనిచేస్తుంది. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా
వాడుతారు.
>అల్లంలో అనేక
పోషక విలువలతో పాటు మిటమిన్ సి, మిటమిన్ ఇ, మంగనీస్, ఐరన్, మెగ్నీషియం ఉన్నాయి.
>అల్లంలో ఉండే
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక
శక్తిని పెంపొందిస్తుంది.
> అల్లం జీర్ణక్రియను
మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ,
తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
>కొలెస్ట్రాల్
తగ్గించే గుణం అల్లంలో ఉంది. రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. శరీరంలోని రక్తప్రసరణ
ను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
>అల్లం నోటి
దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను సంహరించి, దంతాల
ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
>అల్లం మంచి
యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్ బారిన పడకుండ కాపాడుతుంది.
>మధుమేహం
రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అయితే, దీన్ని
మీరు డైట్‌గా తీసుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోండి.
>కీళ్లు, ఆర్థరైటిస్
నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది.
>అల్లం
ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
>అల్లం లోని
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి
ఉపయోగపడుతుంది.
>అల్లం
మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.
>శరీరంలోని
కొవ్వును తగ్గించుకోవడంలో అల్లం సహాయపడుతుంది. అధిక బరువును తగ్గించుకోవడంలో కూడా
సహాయపడుతుంది.
>అల్లం ఎముకల
ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జాయి౦ట్స్ లో ఏర్పడే నొప్పుల నుండి ఉపశమనాన్ని
ఇస్తుంది.
>ఎండాకాలంలో
వడదెబ్బ తగలకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు.
>రక్త
నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకు పోవడం జరుగదు.
>అల్లం వల్ల
కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు.
>బాలింతరాలుకు
శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా
వాడుతారు
>రక్తం రక్త
నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది .
>అల్లం
ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
>అల్లం పొడి
అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
గమనిక: అల్లాన్ని
డైట్‌లో చేర్చుకొనే ముందు తప్పకుండా ఆహార నిపుణులు లేదా వైద్యుల సూచనలు
తీసుకోవాలని మనవి.
0 Komentar