Health benefits
of Sorghum in Telugu
జొన్నలు
ప్రపంచంలో మొదటి
ఐదు ఆరోగ్యకరమైన ధాన్యాల్లో జొన్నలు కూడా ఉన్నాయి. శరీర నిర్మాణానికి తోడ్పడే
ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే
ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు,
ఫోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి.
అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ర౦గు రుచి వాసనా లేకు౦డా తటస్థ౦గా ఉ౦టు౦ది కాబట్టి,
జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లో నయినా కలుపుకోవటానికి వీలుపడుతుంది.
పోషక పదార్థాలు
(100 గ్రా.)
పిండిపదార్ధాలు -
72.6 గ్రా.
మాంసకృత్తులు -
10.4 గ్రా.
పీచు - 1.6 గ్రా
ఇనుము - 4.1
మి.గ్రా.
కాల్షియం - 25
మి.గ్రా.
ఫోలిక్ ఆమ్లం -
20 మి.గ్రా.
జొన్నల వల్ల
కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
>జొన్నలలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా
ఉండటానికి తోడ్పడుతుంది.
>జొన్నల్లో ఉన్న ఫైబర్ కారణం గా అవి చెడు కోలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.
దాని వల్ల గుండె జబ్బులు కానీ, స్ట్రోక్ కానీ రాకుండా ఉంటాయి.
>జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం
ఎంతో మంచిది.
>అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. వీటిలో
ఉండే పోషకాలు, తల్లికే కాదు.. బిడ్డకు మంచిదే.
>జొన్నలు నెమ్మదిగా అరుగుతాయి కాబట్టి రక్తంలో చక్కెర శాతం కూడా నెమ్మదిగా
పెరుగుతుంది. బరువు తగ్గుదామనుకునే వారికీ, డయాబెటీస్ తో బాధ
పడుతున్న వారికీ చక్కటి ఆహారం.
>జొన్నల్లోని మెగ్నీషియం, కాపర్, కాల్షియం వంటివి ఎముకలని బలంగా మారుస్తాయి. జొన్నల్లోని ఐరన్ రక్తంలో
హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
>జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు,
క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్
చేస్తాయి.
>క్యాన్సర్ ను నిరోధించే శక్తి కూడా
వీటిలో ఉంది. చర్మ క్యాన్సర్ కూడా దరిచేరకుండా చేస్తుంది.
0 Komentar