Highlights of
Andhra Pradesh State Cabinet Meeting
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యాంశాలు
రాష్ట్ర
మంత్రివర్గ సమావేశం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం ఉదయం 11
గంటలకు ప్రారంభమైనది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, పలు ముసాయిదా బిల్లులపై
ఇందులో చర్చించారు.
>ఈ నెల 16వ
తేది నుండి జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ
>గత ప్రభుత్వంలో
జరిగిన అవినీతిపై సబ్ కమిటీ నివేదిక పై చర్చ
>భోగాపురం
ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఆమోదం
>45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేలు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్
చేయూత పథకానికి ఆమోదం
>10వేల
మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు
>అంగణవాడీ
విద్యార్ధులకు రెట్టింపు పౌష్టికాహారం
>ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 5,701 మంది డాక్టర్లు, నర్సులు,
ఇతర పారా మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకానికి ఆమోదం
>విజయనగరం
జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు
>ఉన్నత విద్య
నియంత్రణ,
పర్యవేక్షణ కమిషన్ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు ఆమోదం
>జీఎస్‌టీ
వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ
ఇంటెలిజెన్స్ ను ఏర్పాటు
>చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
>అక్రమ మద్యం, ఇసుక రవాణా
నిరోధించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో
>కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ
ముసాయిదా బిల్లుకు ఆమోదం
>గండికోట నిర్వాసితులకు పరిహారం
0 Komentar