శరీరంలో వేడి తగ్గాలంటే ఏమి చేయాలి?
సాధారణంగా ప్రతి ఒక్తికి
బాడీ(శరీరం) యొక్క ఉష్ణోగ్రత 98.6°F (37°C) లకు కొంచెం అటు-ఇటుగా ఉంటుంది. శరీర
ఉష్ణోగ్రత పెరగడం వల్ల పలు ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి మన శరీర
ఉష్ణోగ్రతను నిలకడాగా ఉంచుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మితిమీరిన వేడి
వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి
కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాడం
ఇవన్నీ కూడా బాడీ హీట్ కు ప్రధాన కారణాలు. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ (తేమ)గా
ఉంచుకోవడం చాలా అవసరం.
శరీరంలో వేడి తగ్గించడానికి
చిట్కాలు
>అధికంగా నీరు త్రాగడం
వల్ల శరీరంలోని టాక్సిన్స్ (మలినాలు, విషాలను) తొలగించబడి,
శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
>బాడీ హీట్ ను
తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళు త్రాగడం అత్యంత శ్రేయస్కరం.
>రాగి జావ శరీరంలోని
వేడిని హరించి, శరీరానికి పోషకాలను అందిస్తుంది.
>ఉప్పు కలిపిన
గంజినీళ్ళు, నీరు, మజ్జిగ తాగితే మరీ
మంచిది.
>పుచ్చకాయలో అధికంగా
నీరు ఉండి మిమ్మల్ని చల్లగా మరియు హైడ్రేట్ (శరీరాన్ని తేమగా) ఉంచుతుంది.
>పల్చటి మజ్జిగలో
నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది.
>వెన్న తీసిన మజ్జిగను
ప్రతి రోజూ త్రాగడం వల్ల వేసవి తాపం తీర్చడంతో పాటు శరీరంలో వేడి మటుమాయం
అవుతుంది.
>కర్బూజ బాడీహీట్
తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
> ప్రతి రోజూ కీరదోసకాయ
తిని శరీరంలోని వేడి నేచురల్ గా తగ్గించుకోవచ్చు.
>పుదీనా ఆకులతో తయారు
చేసే జ్యూసు శరీరంలో వేడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
> పెద్ద జీలకర్రను రాత్రంతా
నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి పరకడుపున త్రాగితే శరీరంలోని వేడి
తొలగిపోతుంది.
>శరీరాన్ని చల్లగా
ఉంచుకోవడానికి ప్రతి రోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూసును త్రాగడం మంచిది.
>బాడీ హీట్ తో
బాధపడేవారు ప్రతి రోజూ కొన్ని మెంతులను తినడం మేలు.
>తాజా ఫలాల రసాన్ని
తాగడం, తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తాపాన్ని
తగ్గించుకోవచ్చు.
>క్యారెట్లను మెత్తగా
గ్రైండ్‌చేసి దాంట్లో పాలు, చక్కెర కలిపి జ్యూస్ చేసుకొని
యాలుకల పొడి వేసుకొని వేసవిలో తాగితే శరీరానికి చల్లదన్నాన్ని ఇస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar