Income tax
return filing deadline for FY 2019-20 extended to Nov 30, 2020
ఆదాయపన్ను
రిటర్నుల గడువు పెంపు
ఆదాయపన్ను శాఖ
రిటర్న్‌లు, ఇతరత్రా పలు అంశాలకు సంబంధించిన గడువు పొడిగిస్తూ
సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2018-19 ఆర్థిక
సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ఐటీ)రిటర్నుల సమర్పణ గడువును జులై 31 వరకు పెంచుతూ బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ)
ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20కు చెందిన రిటర్నుల సమర్పణ
గడువును నవంబరు 30 వరకు పెంచుతూ గతంలోనే ఆదేశాలు ఇవ్వడం
గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల మినహాయింపు
కోసం చేసే పెట్టుబడులకు సంబంధించిన క్లెయిమ్స్ గడువును కూడా జూలై 31 వరకు పొడిగించింది. అలాగే, పాన్
కార్డు, ఆధార్ లింక్ చేయడానికి గడువును కూడా 2021 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ
చేసింది.
0 Komentar