Indian Gooseberry Fruit / Amla Health benefits
ఉసిరికాయలు
ఉసిరికాయలు
ప్రకృతి మనకు ఇచ్చిన వరం. ఉసిరి వైద్య పరంగా ఎన్నో ఔషధగుణాలున్న వృక్షం. అలాగే ఈ
చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది.
అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హేరాయిల్స్ తయారీలో నిమగ్నమై ప్రపంచ వ్యాప్తంగా
సరఫరాచేస్తున్నారు. దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు.
ఉపయోగాలు / ఔషధగుణములు
>వీటిలో
విటమిన్ C,
పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా
ఉంటాయి.
>ఇంకుల
తయారీలో,
షాంపూల తయారీల్లో సాస్‌లు, తలకి వేసుకునే రంగుల్లో
కూడా దీనిని విరివిగా వాడుతున్నారు.
>తల భారాన్ని, తలపోటుని
నిరోధించి, మెదడుకి చల్ల దనాన్ని ఇస్తుంది.
>హెమరైజ్‌కి, మెన్‌రేజియా,
లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్త
స్రావాన్ని అరి కట్టడానికి ఔషధంగా వాడతారు.
>ప్రతిరోజు
ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.
>ఉసిరికాయ
కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది.
>2
చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి
మూడు లేక నాలుగు సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది.
>ఉసిరికాయ
రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
>ఉసిరి శరీరంలోని
అదనపు కొవ్వును కరిగిస్తుంది, తద్వారా నిధానంగా బరువును కూడా
తగ్గించుకోవచ్చు.
>దీనితో
తయారుచేసిన ఆమ్లా మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో
ఉపశమనం చేకూరుతుంది.
>ఉదర
సంబంధవ్యాధులకి ఎక్కువగా వాడతారు.
>దీనితో
తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ
రోగాలకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
>ఉప్పులో ఎండ
బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూవుంటే, జీర్ణశక్తి
పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది,
>ఎసిడిటీ, అల్సర్
వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది.
>ఉసిరికాయల్ని
బియ్యంతో ఉడికించి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
>ఉసిరిని
జ్యూస్‌లా చేసుకొని కప్పు నీటిలో కలిపి కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తాగితే ఆరోగ్యానికి
మంచిది.
>జ్ఞాపక
శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు.
>చక్కెర
వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని
చెక్కెరను తగ్గించును.
>అదే విదంగా
కురుల ఆరోగ్యానికి కూడా ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
>దాహం, మంట, వాంతులు, ఆకలిలేకపోవుట, చిక్కిపోవుట, ఎనీమియా, హైపర్ -ఎసిడిటి, మున్నగు
జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది.
>ఆస్తమా, బ్రాంకైటిస్, క్షయ, శ్వాసనాలముల వాపు, ఉపిరితిత్తులనుండి
రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .
>ఉసిరి వల్ల
ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది .
>ఉసిరి లోని 'లినోయిక్
ఆసిడ్' వల్ల తగ్గుతాయి. కాలేయంలో చేరిన మలినాలు, విషపదార్ధాలును తొలగిస్తుంది, 'యాంటి ఆక్షిడెంట్'
గా పనిచేస్తుంది .
>ఉసిరి
రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితె వైటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి, కామెర్లు
రాకుండ సహాయపదుతుంది.
>మలబద్ధకం
సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉసిరి కాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది
>నోటి పూతతో
బాధపడేవారికి ఉసిరి కాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అర కప్పు నీటిలో
ఉసిరి కాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది.
>ఉసిరి
కంటిచూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండ కళ్ళు ఎర్రబడటం, దురదని
కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి
రోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది.
0 Komentar