Indians identity
cards for sale on the dark web
అంగట్లో అమ్మకానికి
భారతీయుల గుర్తింపు కార్డులు..?
దేశానికి చెందిన లక్షమంది
వ్యక్తుల జాతీయ గుర్తింపు కార్డులు డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉన్నట్లు సైబర్
ఇంటెలిజెన్స్ ఫిల్మ్ సిబిల్ తెలిపింది. ఆధార్, పాన్, పాస్పోర్ట్
సహా పలు ఐడీల కాపీలు వాటిలో ఉన్నట్లు తమ తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఈ
సమాచారం ప్రభుత్వం నుంచి లీకైంది కాదని, థర్డ్ పార్టీ యామ్ నుంచి
లీక్ అయ్యాయని అవన్నీ స్కాన్ చేసిన కాపీలేనని వెల్లడించింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన
భారతీయుల వివరాలు అమ్మకానికి ఉన్నాయని పేర్కొంది. డార్క్ వెబ్ లో వీటిని అమ్మకానికి
పెట్టిన వ్యక్తి దగ్గర దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన లక్షమంది కార్డులు ఉన్నట్లు
తెలిపింది. వెబ్ సైట్ నుంచి 1000 ఐడీలను పొందిన తర్వాత
అవన్నీ భారతీయులకు సంబంధించినవేనని తమ పరిశోధనలో తేలినట్లు సిబిల్ తేల్చింది. నో
యువర్ కస్టమర్ ఆప్షన్ పొందినసంస్థల నుంచి ఇవి లీకై ఉండవచ్చని తెలిపింది. ఏడు కోట్ల
మందికి పైగా భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగడి సరకు తరహాలో అంతర్జాలంలో అమ్మకానికి
ఉన్నట్లు గత నెలలోనే 'సైబిల్’ గుర్తించిన సంగతి తెలిసిందే.
0 Komentar