Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jagananna vidya kanuka collection and recording of shoe size Instructions



విద్యార్థుల బూట్ల కొలతలకు ఆదేశాలు
ఉపాధ్యాయులు 1 నుడి 9 తరగతి విద్యార్థులను ఈనెల 8, 9 తేదీల్లో పాఠశాలలకు రప్పించి కొలతలు తీసుకోవాలి..
బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు
>రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్/ మున్సిపల్/ కేజీబీవీ, మోడల్ స్కూల్స్/ ఆశ్రమ, రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాల్లో ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
>ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు/ వ్యాయామ ఉపాధ్యాయులు/ పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, స్థానికంగా ఉన్న సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.
>ఈ బాధ్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.
>ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
>విద్యార్థుల పాదాల కొలతలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయుట. ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.
ముఖ్యంగా చేయవలసినవి
>విద్యార్ధులపాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి. (ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5 ఇంచీలు ఉంటే కాస్త పెంచి 6 ఇంచీలు సైజుగా నమోదు చేయాలి.)
>ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తమ పాఠశాల విద్యార్థులను 8.6.2020 మరియు 9.6.2020 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలకు రప్పించాలి
>విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్- 19 ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా ఆచరిస్తూ భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగు జాగ్రత్తలు వహించాలి.
>శానిటైజర్ వంటి వాటి కోసం పాఠశాల కాంపోజిట్ నిధులను వినియోగించుకోవాలి.
>పాఠశాలకు రాలేని పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థుల, కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/ రెసిడెన్షియల్ తదితర హాస్టల్లో చదివే బాలబాలికల పాదాల కొలతలు తీసుకోవడానికి జగనన్న గోరుముద్ద పథకం (మధ్యాహ్నభోజనం)లో భాగంగా విద్యార్థులకు డైరేషన్  (బియ్యం, చిక్కీ, గుడ్లు) అందిస్తున్న వాలంటీర్ల సాయ0 తీసుకొని, ఆ విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేలా సీఆర్పీలు చర్యలు తీసుకోవాలి.
బూట్ల పంపిణీ కోసం విద్యార్థుల పాదాల కొలతల నమోదు ఇలా

>విద్యార్థుల పాదాల కొలతలన్నీ హెచ్ఎం లాగిన్లలో పొందుపరచాలి. హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయగానే పాఠశాల, విద్యార్థుల పేర్లు, తదితర వివరాలుఉంటాయి.
>సెంటీమీటర్లు, ఇంచీల వివరాల టేబుల్
>విద్యార్థుల వివరాల పక్కనే సైజ్ ఆప్షన్ బాక్సులో వారి పాదాల కొలతలను సెంటీమీటర్లలో నింపాలి.
>నమోదు గడువు 10-06-2020
Rc.No.16021/4/2019 dated:01/06/2020
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags