10వ
తరగతి పరీక్షల నిర్వహణకే కర్ణాటక ప్రభుత్వం మొగ్గు
కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ
10వ తరగతి పరీక్షల నిర్వహణకే కర్ణాటక ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. ఈనెల 25 నుంచి జులై 4వ తేదీ వరకు నిర్వహించనున్నా 10వ తరగతి పరీక్షలకు 8.40 లక్షల మంది విద్యార్థులు
హాజరు కానున్నారు. రవాణా, ఆరోగ్య, హోం
శాఖల సమన్వయంతో సురక్షితంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సురేశ్
కుమార్ బుధవారం ప్రకటించారు. అలాగే వాయిదా పడిన ఇంటర్ ఆంగ్ల పరీక్షను ఈనెల 18న నిర్వహించనున్నారు. ఐతే కరోనా దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి ప్రభుత్వాలు పరీక్షలను
రద్దుచేసిన సంగతి తెలిసిందే.
0 Komentar