కరెంట్ బిల్
రూ.లక్ష దాటినా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.కోటి దాటినా ఇక ఐటీ రిటర్న్ మస్ట్..
కొత్త ఐటీఆర్
పత్రాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య ఆర్జించిన ఆదాయానికి సంబంధించి 2020-21 మదింపు
సంవత్సరానికి ఐటీఆర్-1 (సహణి), ఐటీఆర్-2,
ఐటీఆర్-8, ఐటీఆర్-4 (సుగమ్),
ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7,
ఐటీఆర్-జులను సీబీడీటీ నోటిఫై చేసింది. ఈ కొత్త ఐటీఆర్ పత్రాలలో,
పన్ను చెల్లింపుదార్లు అధిక వ్యయాలకు సంబంధించిన లావాదేవీలను
తెలియజేయాల్సి ఉంటుంది.
కరెంట్ బిల్లు
లక్ష రూపాయలు దాటితే తప్పనిసరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది
ఆదాయపన్ను శాఖ. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.కోటి దాటినా రిటర్న్ దాఖలు చేయడాన్ని
తప్పని సరి చేసింది. కరోనా వైరస్ కారణంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లు, ప్రయోజనాలను
పన్ను చెల్లింపుదారులకు అందించేందుకు ఐటీ ఫారాల్లో మార్పులు చేశారు. ఐటీ యాక్ట్ 1961లోని వేర్వేరు కాల పరిమితులను పొడిగించింది కేంద్రం. ప్రత్యేక ఆర్డినెన్స్
2020 ద్వారా ఈ మార్పులు చేసింది. దీని ప్రకారం
చాప్టర్-వీఐఏ-బీ ద్వారా పెట్టుబడులు, ఇతర చెల్లిపులు,
సెక్షన్ 80 సీ (ఎల్‌ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎన్‌సీ), 80 డీ
(మెడిక్లెయిమ్), 80జీ (విరాళాలు) ప్రయోజనాలు పొందేందుకు 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించింది. అలాగే ఐటీఆర్-1లో
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వోద్యోగులను విభజించడంతో పాటు కొత్త
కాలమ్ 'ఎన్ఏ'ను కూడా జత చేర్చారు.
> వార్షికాదాయం రూ.50 లక్షల లోపు కలిగిన సాధారణ
పౌరులు ఐటీఆర్-1
>వ్యాపారాలు, వృత్తుల నుంచి వార్షికాదాయం రూ.50 లక్షల లోపు కలిగిన పౌరులు, హిందూ అవిభక్త కుటుంబాలు,
సంస్థలు (ఎల్వల్ప మినహా) ఐటీఆర్-4 దాఖలు
చేయాలి.
ఐటీ రిటర్న్
ఫారాల్లోని కీలక మార్పులు ఇవే:
> కరెంట్ ఖాతాలో డిపాజిట్లు కోటి రూపాయలు దాటితే వివరాలు ఖచ్చితంగా తెలపాలి
> కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటితే రిటర్న్ దాఖలు చేయాలి
> విదేశీ ప్రయాణాల ఖర్చు రూ.2 లక్షలు దాటితే వివరాలు
తెలియజేయాలి
>పన్ను ఆదా పెట్టుబడులు, విరాళాలకు సంబందంచిన
వివరాలను 2019-20, 2020 జూన్‌కు గానూ వేర్వేరుగా సమర్పించాలి.
>2020 జూన్ వరకు చేసిన పన్ను మినహాయింపు పొందే పెట్టుబడులు/చందాలను కూడా
ప్రత్యేకంగా చూపించుకోవచ్చు.
>ఆధార్ నంబరు అందించిన ఐటీఆర్-4 మదింపుదారు పాన్
నంబరును తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని సీబీడీటీ పేర్కొంది.
0 Komentar