ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్
విద్యలో రానున్న కీలక మార్పులు..
వచ్చే విద్యా
సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో సీబీఎస్‌ఈ
తరహాలో అనేక సంస్కరణలను ఇంటర్
విద్యామండలి తీసుకొస్తోంది. అవి..
>ప్రశ్నల
సంఖ్యను పెంచి, మార్కులను తగ్గిస్తారు. పుస్తకంలోని అన్ని అధ్యాయాల
నుంచి ప్రశ్నలు వస్తాయి.
>విద్యార్థులు
అన్ని అంశాలూ నేర్చుకోవడం వల్ల ఎంసెట్, జేఈఈ, నీట్‌లకు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
>ఒక్కో
సెక్షన్‌కు 40మందికే పరిమితం, అలాగే ఒక్కో కళాశాలకు అన్ని గ్రూపులూ
కలిపి గరిష్ఠంగా 9 సెక్షన్లకే అనుమతి.
>ప్రైవేటు, కార్పొరేట్
కళాశాలల రుసుములను కమిషన్ నిర్ణయించి ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులో
ఉంచుతారు.
>ఇంటర్
ప్రవేశాలు, ధ్రువపత్రాల పరిశీలన అంతా ఆన్‌లైన్‌లోనే. అలాగే సీట్ల కేటాయింపులో
రిజర్వేషన్ అమలవుతుంది.
> పనివేళలు ఉదయం
8.30 నుంచి సాయంత్రం 3.30 వరకు తరగతులు, మరో గంటపాటు క్రీడలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు
నిర్ణయం.
>వారంలో ఒకటి, రెండు
రోజులు చర్చా వేదికలు, సెమినార్లు.
>ఎంసెట్, జేఈఈ,
నీట్, ఇతరత్రా శిక్షణలకు కళాశాలలు ప్రత్యేక
అనుమతి తీసుకోవాలి. ఈ శిక్షణ రుసుములను పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయిస్తుంది.
>ఎప్పటికప్పుడు
తనిఖీలు నిర్వహించి నివేదికల వివరాలను వెబ్‌సైట్‌లో తల్లిదండ్రులకు అందుబాటులో
ఉంచుతారు.
>ప్రభుత్వ
జూనియర్ కళాశాలల్లో 20 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న
గ్రూపులను మూసేస్తారు.
>విద్యా
సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనా ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీడియా పాఠాలను రూపొందిచి
వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
0 Komentar