Model Service Register (SR) Entries Book
Prepared By: Sri
D.Deva Ratnam & Sri Sk.Md. Rafi, Guntur Dt.
ఉద్యోగి లేదా ఉపాధ్యాయుని
సర్వీసు పరంగా ఎప్పటికప్పుడు ఉద్యోగం నందు చేరిన తేది నుండి పదవీ విరమణ తేది వరకు, పదవీ
విరమణ తదుపరి పెన్షను సదుపాయముల మంజూరు కొరకు, మెడికల్
రియంబర్సుమెంటు క్లయిమ్ వివరాలు వగైరాలు & ఉద్యోగి
మరణానంతరము అర్హులైన వారికి ఫ్యామిలీ పెన్షను పొందుటకుగాను పొందుపరచవలసిన ఆంశములను
ఎప్పటికప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా జరిగే మార్పులను నమోదు కొరకు
ఉపయోగించేది ఈ సర్వీసు రిజిష్టరు.
ఈ సర్వీసు
రిజిష్టరు ఆధారంగా వీరి సేవలు గుర్తించి రావలసిన ఆర్థికపరమైన సౌలభ్యాలు
కల్పించటానికి కార్యాలయాధి కారి గారికి ఇదొక దిక్సూచి లాంటిది. మనకు బైబిలు, భగవద్గీత
మరియు ఖురాన్ వంటి పవిత్ర గ్రంధాలు నిజజీవితంలో ఎంత ప్రాముఖ్యమో, ఉద్యోగికి ఈ సర్వీసు రిజిష్టరు అనేది కూడా ప్రాముఖ్యత గలది అనుటలో సందేహము
లేదు. కావున ఇటువంటి ప్రాముఖ్యత కల్గిన సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవలసిన అంశాలు
మరియు దీనియొక్క నిర్వహణ గురించి కనీస జ్ఞానము కలిగియుండుట అనేది మన యొక్క
వ్యక్తిగత ప్రాధమిక బాధ్యతగా గుర్తించాలి.
Model Service Register Entries Book
0 Komentar