Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

More than 13,500 VIVO phones running on same IMEI Number

వివో కంపెనీకి చెందిన 13,500 మొబైల్‌ ఫోన్లకు ఒకే IMEI నెంబర్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 13,500 మొబైల్‌ ఫోన్లు ఒకే IMEI నెంబర్‌ (ఇంటర్‌ నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ) కలిగి ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మీరట్‌కు చెందిన ఓ పోలీసు అధికారి సెల్‌ఫోన్‌ రిపేరు నేపథ్యంలో ఐఎమ్‌ఈఐల విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు వివో మొబైల్‌ కంపెనీ, సర్వీస్‌ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. “ఇది భద్రతకు సంబంధించిన సీరియస్‌ సమస్య. మొబైల్‌ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తులు వారి స్వలాభానికి దాన్ని వాడుకునే అవకాశం ఉంది’’  అని ఎస్పీ అఖిలేష్‌ ఎన్‌. సింగ్‌  అన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags