అంగన్వాడీల్లోనూ
‘నాడు – నేడు’
ప్రభుత్వ
పాఠశాలలో మాదిరిగానే అంగన్వాడీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు
చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కూళ్లలో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని,
అదే తరహాలో అంగన్వాడీల్లో కూడా నాడు – నేడు
కింద అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాలు కల్పించాలని
సూచించారు. అలాగే అంగన్వాడీల్లో గర్భవతులకు, తల్లులకు,
పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని సూచించారు. అంగన్వాడీల్లో
పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబులైట్లు,
ఫ్రిజ్, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్
బోర్డులు, ప్రహరీగోడ సహా కావాల్సిన మరమ్మతులు చేసి, సదుపాయాలను కల్పించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
దాదాపు 24 వేల
అంగన్వాడీ భవనాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటిలో చేపట్టాల్సిన పనులు,
సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే
భవనాల్లేని చోట్ల, 31వేల అంగన్వాడీల నిర్మాణానికి అంచనాలు
కూడా రూపొందించాలన్నారు. అంగన్వాడీ స్కూళ్లన్నీ కూడా ప్రీ స్కూల్ తరహా
విధానంలోకి రావాలని, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం
ద్వారా వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, మంచి
పౌష్టికాహారాన్ని తల్లులకు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక
సమర్పించాలన్నారు. అలాగే బకాయిలు లేకుండా గ్రీన్ ఛానల్లో చెల్లింపులు జరిగేలా
చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
0 Komentar