Narendra Modi's address to the Nation
జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ లైవ్
లో చూడండి
ప్రధాని నరేంద్ర
మోదీ ప్రసంగం లోని ముఖ్యాంశాలు
ఇతర దేశాలతో
పోలిస్తే కరోనా పోరాటంలో భారత్ ముందుందని తెలిపారు. కరోనాతో చనిపోతున్నవారి
సంఖ్యను చూస్తే.. ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.సరైన
సమయంలో లాక్‌డౌన్ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉంది. కానీ అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు.
>కొద్దిరోజుల
నుంచి మాస్కులు వేసుకోవడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
>మళ్లీ ఒకసారి
రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
>నిబంధనలు
పాటించకపోతే జరిమానా విధించాలి.
>వానాకాలంలో జలుబు, జ్వరం వంటి
రకరకాల జబ్బులు చుట్టుముడతాయి. ఈ సమయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలి.
>ప్రధాని
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్
అఖరు వరకు ఉచిత రేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
>జూలై నుంచి నవంబర్
వరకు 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల బియ్యంతోపాటుగా, కిలో పప్పు అందజేస్తామని
తెలిపారు.
0 Komentar