ఎన్‌సీఈఆర్టీకి
కొత్త మార్గదర్శకాలు
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్
ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1-5 క్లాస్ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్,
పోస్టర్ ప్రజెంటేషన్స్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6-12 తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా
టీచర్లకు శిక్షణా తరగతుల్ని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి. 6-12 తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్
నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని
విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్ ను, పుస్తకాల తయారీ
పని డిసెంబర్‌కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది.
0 Komentar