పాఠశాలల
పునఃప్రారంభంపై కేంద్రానికి ఎన్‌సీఈఆర్‌టీ ముసాయిదా నివేదిక సమర్పణ
పాఠశాలల
పునఃప్రారంభంపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ)
ముసాయిదా నివేదికను కేంద్రప్రభుత్వం ముందు ఉంచినది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం
తెలిపిన అనంతరం వాటిని ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని
పరిశీలించి స్థానిక పరిస్థితులను బట్టి మార్పులు చేయనున్నారు.
నివేదికలోని ప్రతిపాదనలు
>విడతల వారీగా
తరగతులు అనగా మొదట ఇంటర్, వారం తరువాత 9, 10
తరగతులు, మరో రెండు వారాల అనంతరం 6, 7, 8 తరగతులు, మూడు వారాల అనంతరం 3, 4, 5 తరగతులు, నాలుగు వారాల తరువాత 1, 2 తరగతులు మొదలుపెట్టాలి. చివర్లో
నర్సరీ తరగతులను ప్రారంభించాలి.
>పాఠశాల అసెంబ్లీ, సాముహ క్రీడలను
రద్దు చేయాలి
>తరగతి గదికి ఎక్కువ మంది
విద్యార్థులు లేకుండా పరిమిత సంఖ్య(15-20) లో సంఖ్యలో ఉండేటట్లు చూడాలి
>తరగతిలో సగం
మందికి ఒకరోజు, మిగిలిన వారికి మరో రోజు తరగతులు షిఫ్టు విధానంలో
తరగతులు జరపాలి
>అసైన్‌మెంట్లు
ఇంటికే ఇవ్వాలి.
>తరగతులలో
విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలో తెలియజేస్తూ
బల్లపై విద్యార్థుల పేర్లు ముందుగా రాయాలి
>ఒక్కో తరగతి వేర్వేరుగా
విరామ సమయం కేటాయించాలి
>తరగతి గది కిటికీలు
ఎప్పుడూ తెరిచే ఉంచాలి.
>బడుల వద్ద
తినుబండారాల విక్రయాలు నిషేధం.
>పాఠశాల
ప్రాంగణంలోని ఆరుబయట స్థలంలోనూ తరగతులు నిర్వహించుకోవచ్చు.
>హాస్టళ్లు
ఉంటే విడతల వారీగా విద్యార్థులను రప్పించాలి.
0 Komentar