కొత్త
విద్యాసంవత్సరం అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే చాన్స్ ..?
దేశవ్యాప్తంగా
విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో
జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.
ఇంటర్మీడియెట్, టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన
మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం
కేలండర్‌ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హెచ్‌ఆర్‌డీ
మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను
రూపొందించడానికి యూజీసీ ప్యానెల్ మరో వారం రోజుల్లో మార్గదర్శకాలను
ప్రకటిస్తుందని హెచ్‌ఆర్‌డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు.
ఫైనల్ ఇయర్
పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా
మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల
విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్ తగ్గుముఖం
పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు,
సెప్టెంబర్‌లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్
వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
0 Komentar