New education
reforms as per National Education Policy 2019
జాతీయ నూతన విద్యా
విధానం-2019
ప్రకారం రాష్ట్రంలో విద్యా సంస్కరణలు
-5+3+3+4
విధానంలో పాఠశాల విద్య
పిల్లల్లో
పటిష్టమైన విద్యా పునాదులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర
నూతన విద్యావిధానం-2019 ప్రకారం ముందుకెళ్లనుంది. ఈ విధానంలో పాఠశాల విద్యకు
సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను
ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ విధానంలో దేశవ్యాప్తంగా ఒకేరకమైన
ప్యాట్రన్ ఉండడం మంచిదని నూతన విద్యావిధానం చెబుతోంది. ఇందుకు అనుగుణంగా
రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోనున్నారు. వాటికి అనుగుణంగా రాష్ట్రంలో పాఠశాల విద్య
కరిక్యులంను పునర్నిర్మితం చేయనున్నారు. 5+3+3+4 విధానాన్ని అనుసరించనున్నారు.
5+3+3+4 విధానం
అంటే ఏమిటి..?
*3 ఏళ్ల ప్రీ
ప్రైమరీ,
1, 2 తరగతులు
*ప్రిపరేటరీ
గ్రేడ్ గా 3, 4, 5 తరగతులు,
*మిడిల్ గ్రేడ్
గా 6,
7, 8, తరగతులు
* ఇక హయ్యర్
గ్రేడ్ లో 9, 10, 11, 12
తరగతులు
0 Komentar