గ్రామ, వార్డు
సచివాయాల ద్వారా 5రోజుల్లో కొత్త రేషన్ కార్డులు
గ్రామ, వార్డు
సచివాలయాల ద్వారా కొత్త రేషన్ కార్డుల జారీ తో పాటు అదనంగా మరో నాలుగు రకాల సేవలను
నేడు సీఎం జగన్ అమరావతిలో ప్రారంభించనున్నారు. కొత్త కార్డుల జారీ, ఇతర సేవల దరఖాస్తులను 5రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు
విధించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నేటి నుండి కొత్త
రేషన్‌కార్డు మంజూరుకు దరఖాస్తు, రేషన్‌కార్డు స్ల్పిటింగ్ (కుటుంబ
విభజన), రేషన్ కార్డుల్లో చేర్పులు (కొత్తగా వివాహం,
జననం), తొలగింపు (మృతుల పేర్లు మాత్రమే),
రేషన్ కార్డు సరండర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. లబ్ధిదారులు
తమ దరఖాస్తులను తమ పరిధిలోని వాలంటీర్లు, వీఆర్వోలకు
అందజేయాలి. కొత్త కార్డులను గ్రామ సచివాలయాలలోనే ప్రింట్ చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
0 Komentar