దేశవ్యాప్తంగా 1వ
తరగతి నుంచి 12వ తరగతి వరకు కొత్త సిలబస్
దేశవ్యాప్తంగా ఒకటి నుంచి 12వ తరగతి వరకు 2021-22 విద్యా సంవత్సరం నాటికి కొత్త సిలబస్ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్) రూపకల్పన పని ఇప్పటికే ప్రారంభమైంది. దీని ప్రకారం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్య పుస్తకాలను రూపొందించనుంది. కొత్త సిలబస్ తయారీ ప్రక్రియను నిపుణులు త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబరు కల్లా మధ్యంతర నివేదిక అందజేయనున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, సృజనాత్మక, జీవనైపుణ్యాలు, నాగరికతను పెంచడంతోపాటు కళలు తదితర అంశాలనూ సిలబస్‌లో చేర్చనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నూతన పాఠ్యప్రణాళిక ఎలా ఉండబోతున్నదనే విషయమై ఒక రూపం రానుంది.
0 Komentar