No sale,
registration of BS-IV vehicles will be permitted in India
బీఎస్-4 వాహనాల అమ్మకాలకు,
రిజిస్ట్రేషన్‌కు అనుమతి లేదు- సుప్రీం కోర్టు
దేశవ్యాప్తంగా బీఎస్ (భారత్
స్టేజ్)-4 వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషను అనుమతి లేదని సుప్రీం
కోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 1, 2020 నుంచి బీఎస్ 4 వాహనాల
అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉంది. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 25 నుంచి మార్చి 31 వరకు ఆరు రోజుల పాటు బీఎస్-4
వాహనాలను సంస్థలు, డీలర్లు అమ్మలేకపోయారు. అందుకు ప్రతిగా,
లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత 10 రోజుల పాటు అమ్ముడుపోని వాటిలో 10% వాహనాలను
అమ్ముకునే వెసులుబాటు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు మార్చి 27న ఇచ్చిన ఆదేశాల్లో
పేర్కొంది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో సూచించిన అంకె కంటే అఫిడవిట్ లో సూచించిన వాహనాల
సంఖ్య ఎక్కువగా ఉందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ ఎత్తివేసిన
తరువాత అమ్మకాలు జరిగిన వాహనాలను కోర్టు అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేయవద్దని,
అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని
ఆదేశించింది.
0 Komentar