Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Parents petition against re-opening schools

కరోనా అదుపులోకి వచ్చే వరకు బడులు తెరవద్దు
- రెండు లక్షల మందికి పైగా కేంద్రానికి పిటిషన్...
జూలైలో విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే వరకు లేదా కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు స్కూళ్లకు అనుమతి ఇవ్వొద్దని 2.13 లక్షల మందికి పైగా తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరారు. లాక్డౌన్  ఎత్తివేసేందుకు కేంద్రం రూపొందించిన అన్ లాక్ వ్యూహంలో భాగంగా స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యాసంస్థలు జూలైలో తెరిచే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు ఈ మేరకు పిటిషన్ పెట్టారు. కరోనా ఉండగా స్కూళ్లు నిర్వహించడం నిప్పుతో ఆడుకోవడం లాంటిదని చెప్పారు. ఈ లెర్నింగ్ ఉపయోగకరమైనదైతే వచ్చే విద్యా సంవత్సరానికి అందులోనే పాఠాలు నిర్వహించాలని కోరారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags