CBSE పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండుల వెల్లువ
కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతండటంతో 10,
12వ తరగతుల విద్యార్థుల సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని పెద్ద
ఎత్తున ఆన్లైన్ ఉద్యమం ఊపందుకున్నది. ఇప్పటికే పరీక్షల రద్దుకు కేంద్రానికి
ఆదేశాలివ్వాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి
‘livesoverexams’, ‘CancelBoardExams’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్
మీడియాలో చేపట్టిన ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాల మేరకు
సగటు మార్కులను గణించి, విద్యార్థులను పాస్ చేయడం.. లేదా
ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ప్రమోట్ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర
ప్రభుత్వాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
0 Komentar