Patanjali
launches 'CORONIL' ayuredic medicine to treat coronavirus
కరోనాకు ‘కొరోనిల్’
పేరుతో ఆయుర్వేద మందు విడుదల చేసిన పతంజలి
ప్రపంచ దేశాలను
వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి పతంజలి సంస్థ ఆయుర్వేద మందును తీసుకొచ్చింది.
'కోరోనిల్' పేరుతో మార్కెట్‌లో ఈ ఆయుర్వేద మందును
తీసుకొచ్చారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయొచ్చని ఆ సంస్థ వ్యవస్థాపకులు బాబా
రాందేవ్ వెల్లడించారు.
అశ్వగంధ, గిలోయ్,
తులసితో కలిపి కరోనిల్‌ను కరోనా బాధితులకు చికిత్సలో
వినియోగించినప్పుడు 100 శాతం మంది కోలుకున్నారని బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి
రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా రూపొందించినట్టు వెల్లడించారు. క్లినికల్
ట్రయల్స్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మందును తీసుకొచ్చామని ఆయన
వివరించారు.
‘కొరోనిల్’ మాత్రల ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి
పేర్కొంది. కాగా, భారత ఫార్మా దిగ్గజ కంపెనీలో గ్లెన్ మార్క్,
హెటిరో, సిప్లా కంపెనీలు కూడా కరోనాకు
ఫెబిఫ్లూ పేరుతో మాత్రలు, సూది మందును మార్కెట్‌లోకి విడుదల
చేసిన విషయం తెల్సిందే.
0 Komentar