సీబీఎస్ఈ
పరీక్షలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్
జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ జారీ చేసిన నోటిఫికేషన్ను
రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. కరోనా వేగంగా
విస్తరిస్తున్న తరుణంలో పరీక్షల నిర్వహణ ప్రమాదకరమని, అందువల్ల
ఆ పరీక్షలను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని అందులో కోరారు. ఇప్పటికే పూర్తయిన
పరీక్షలు, ఇంటర్నల్స్ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించాలని సీబీఎస్ఈ
ఆదేశించాలని అభ్యర్థించారు.
0 Komentar