ఉద్యోగులు
అధికారులు హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లరాదు- మార్గదర్శకాలు
జారీ
ప్రభుత్వ
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని,
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. కంటైన్మెంట్
జోన్లలో ఉండే ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని, అలాంటి
వారికి సెలవుగా పరిగణించకుండా విధులకు వచ్చినట్లే భావిస్తారని సీఎస్ స్పష్టం
చేశారు. అధికారుల అనుమతి తో హై షుగర్, బీపీతో పాటు గుండె,
కిడ్నీ సంబంధిత దీర్ఘకాల వ్యాధులున్న వారు, 60
ఏళ్లున్న వారు, గర్భిణులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తికి నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన పూర్తి మార్గదర్శకాల కోసం క్రింది GO చూడండి..
Containment,
Control, and Prevention of COVID – 19 - “Lockdown”
extension till 30th June, 2020 – Observing COVID-19 protocol in attending
offices and leaving headquarters to go outside the state including
Hyderabad – Further instructions – Issued.
G.O.RT.No. 985 Dated: 12-06-2020.
0 Komentar