అంగన్‌వాడీలకు
నాణ్యమైన బియ్యం
ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇకపై నాణ్యమైన
బియ్యాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ,
విభిన్న ప్రతిభావంతుల, వయో వృద్ధులశాఖ సంచాలకులు
డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో భారత ఆహార
సంస్థ ప్రమాణాల మేరకు విరిగిన బియ్యం 25 శాతం వరకు ఉంటాయని, ఇకపై
పంపిణీ చేసే బియ్యంలో అవి 15 శాతానికే పరిమితమవుతాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రంగు మారిన గింజలు కూడా మూడు శాతం నుంచి 0.75 శాతానికి తగ్గుతాయని, దెబ్బతిన్న గింజలు కూడా మూడు శాతం నుంచి 0.75 శాతానికి పరిమితమవుతాయని
తెలిపారు. దీని ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు,
చిన్నారులకు లాభం చేకూరనున్నది.
0 Komentar