Rationalization prior to teacher transfers
ఉపాధ్యాయుల
బదిలీలకు ముందే రేషనలైజేషన్
-
కొన్ని పాఠశాలల్లో పిల్లల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయి మరికొన్ని చోట్ల
పిల్లలకు సరిపడా టీచర్లు
లేని పరిస్థితి
ఉపాధ్యాయుల
బదిలీల నిర్వహణకు ముందే రేషనలైజేషన్ (సర్దుబాటు) ప్రక్రియను ఒక కొలిక్కి తేవాలనే
యోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది. వివిధ
జిల్లా విద్యాశాఖల నుంచి టీచర్ల పోస్టులు, పని సర్దుబాటు వివరాలతో
కూడిన సమాచారం పంపాలని ఆదేశించింది. దీంతో జిల్లా విద్యాశాఖ నుంచి డివిజన్ ఉప
విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు పాఠశాలల వారీగా శాంక్షన్డ్ పోస్టులు.. ప్రస్తుతం
పని చేస్తున్న వారి వివరాలు, పిల్లల ఎన్‌రోల్‌మెంట్
వివరాలను తక్షణమే అప్‌లోడ్ చేయాలని సూచించింది.
అనేక
పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నాయి. కానీ
ఉపాధ్యాయులు మాత్రం ఇద్దరు, ముగ్గురికి తక్కువ
కాకుండా ఉన్నారు. మరికొన్ని చోట్ల పిల్లలకు సరిపడా టీచర్లు లేక ఉపాధ్యాయుల కొరత
ఎదుర్కొంటున్నాయి. ఈ అసమానతలను నివారించి ప్రతి ఉపాధ్యాయుడికి పనిభారం (వర్క్
లోడ్) చూపించటానికి రేషనలైజేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు.
0 Komentar