ATM వినియోగదారులకు RBI షాకివ్వనున్నదా ..?
కరోనా కారణంగా ఏర్పడిన
ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక
నిర్ణయం తీసుకోనుంది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు
తెలుస్తోంది. ఇకపై ATMల ద్వారా రూ.5వేల వరకు విత్ డ్రా
చేసుకోవడానికి అనుమతించాలని, ప్రస్తుతం విధిస్తున్న ATM
ఛార్జీలను పెంచాలని RBI నియమించిన కమిటీ
సిఫార్సు చేసింది. 10లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోని
ATMలకు ఛార్జీలను 16%నికి, 10లక్షల లోపు ఉన్న ప్రాంతాల్లోని ATMల ఛార్జీలను 24% పెంచాలంది. మరి దీనిపై RBI ఎలాంటి నిర్ణయం
తీసుకుంటుందో చూడాలి. కమిటీ సమర్పించిన రిపోర్టును బ్యాంకు అత్యున్నత స్థాయి
అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో కమిటీ
నివేదిక అమలుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో
ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది.
0 Komentar