Salary of central
government employees will not increase till march-2021
ఉద్యోగులకు ఝలక్
ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంక్రిమెంట్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే
ఏడాది వరకూ శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది. అంటే కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం మార్చి 31, 2021 వరకూ ఎదురు
చూడాల్సి ఉంటుంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర
ప్రభుత్వం చెబుతోంది.
2019-2020 ఆర్థిక
సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక పనితీరు అంచనా గడువును పొడిగిస్తూ కేంద్ర
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు గడువు పొడిగిస్తున్నట్లు
పేర్కొంది. ప్రభుత్వం ఈ గడువును ఇది వరకు డిసెంబర్ 2020 వరకు మాత్రమే
పొడిగించింది. ఇప్పుడు మార్చి 31ను తాజా డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. సాధారణంగా
అయితే ఇప్పటికే ఇంక్రిమెంట్ల ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉంది. దీంతో లక్షల మంది
ఉద్యోగులపై ప్రభావం పడనుంది.
0 Komentar