SBI re-launches
Aadhaar-based online savings account opening facility
ఆధార్‌తో తక్షణమే
డిజిటల్ పొదుపు ఖాతా: ఎస్‌బీఐ
యోనోయాతో ఎస్బీఐ
ఖాతా తెరవొచ్చు
SBI బ్యాంకు ఆధార్ సాయంతో ఆన్లైన్ ఖాతా తెరిచే సదుపాయాన్ని తిరిగి
తీసుకొచ్చింది. యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా ఖాతాదార్లు తమ ఆధార్, శాశ్వత ఖాతా సంఖ్య
(పాన్) ను ఉపయోగించి ఆన్‌లైన్ డిజిటల్ పొదుపు ఖాతాను తెరుచుకోవచ్చు. అలాగే ఇన్స్టా
సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు బేసిక్ రూపే ఏటీఎం డెబిట్ కార్డును జారీ చేయనున్నారు.
ఈ ఖాతాదార్లకు నామినేషన్ సదుపాయంతో పాటు SMS
అలర్ట్ లు, ఎస్‌బీఐ మిస్డ్ కాల్ సర్వీస్ వంటి సేవలు కూడా
అందుతాయి.
ఎలా
ప్రారంభించాలి..?
>కస్టమర్లు
అకౌంట్ కోసం ముందుగా తమ ఫోన్లో యోనో యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
>పాన్, ఆధార్,
వన్‌టైమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అక్కడ అడిగిన ఇతర వివరాలను నమోదు చేయాలి.
అనంతరం వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
>ప్రక్రియ పూర్తైన
తరువాత ఖాతాను యాక్టివేట్ చేసుకుని, లావాదేవీలు
ప్రారంభించుకోవచ్చు.
>బ్యాంకు శాఖకు వెళ్లి
కేవైసీకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడం ద్వారా ఆ ఖాతాను 'ఫుల్ కేవైసీ' అకౌంట్
గా మార్చుకోవచ్చు.SBI YONO APP
DOWNLOAD
0 Komentar