Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Schools starts in Telangana from 1st July

తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
తెలంగాణలో జూలై 1 నుంచి ఉన్నత పాఠశాలలను, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన పక్షంలో ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అనేక జాగ్రతలు పాటించనున్నది.
పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలివే..!
>2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకే పరిమితం
>ఒక తరగతి గదికి 15 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతి
>జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలున్న విద్యార్థులు బడులకు హాజరు కావొద్దని సూచించింది.
>తరగతి గదుల్లో భౌతికదూరం, మాస్కు వాడటం
>పాఠశాల పని గంటల్లో ఒక గంటను తగ్గించారు.
>ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ కాబట్టి షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులు
>ప్రాథమిక పాఠశాలల్లో ఆదివారం, సోమవారం సెలవు. రెండో శనివారం మాత్రం సెలవు ఉండదు.
>ప్రాథమిక పాఠశాల సిలబస్‌ 30శాతం తగ్గించి 70శాతానికి కుదింపు
>పనిదినాలను 150 రోజులకు తగ్గించింది. 
>8-10 తరగతులకు ప్రతి రోజూ క్లాసులు
> పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం ఒక్కో తరగతికి వేర్వేరుగా భోజనాన్ని అందజేసే విధానం
>పాఠశాలల్లో ఎటువంటి ఆటలకు అనుమతి లేదు.
Previous
Next Post »
0 Komentar

Google Tags