దేశవ్యాప్తంగా ఆగష్టు
తర్వాతే స్కూళ్లు ఓపెన్: కేంద్రమంత్రి
ఆగష్టు తర్వాతే
దేశంలో స్కూళ్లు ఓపెన్ అవుతాయని కేంద్రమంత్రి రమేష్ పోఖియాల్ చెప్పారు. స్కూళ్లు
ఎప్పుడు తెరుస్తారన్న దానిపై 33 కోట్ల మంది విద్యార్థులు
ఎదురుచూస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను తెరుస్తాయన్న ప్రచారం నేపథ్యంలో
ఆగష్టు తర్వాతే స్కూళ్లు ఓపెన్ అవుతాయని స్పష్టం చేశారు. అవకాశం ఉంటే ఆగష్టు రెండవ
వారంలో స్కూళ్లు ప్రారంభం అవుతాయని.. ఈ లోపు పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని
మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం
లాక్ డౌన్ 5 మార్గదర్శకాల ప్రకారం జూలైలో పాఠశాలలు రీ ఓపెన్ చేసే
అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. అది కూదా అందరికీ కాదు. 8 కంటే తక్కువ తరగతుల వారిని మినహాయించి, ఆ పైన
స్టూడెంట్స్ కు మాత్రమే పాఠశాలల్లో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.
మిగిలిన వారు ఇంటి వద్దే ఉండటం తప్ప మరో ఆప్షన్ లేదు. మార్నింగ్ ఒక బ్యాచ్,
మధ్యాహ్నం మరో బ్యాచ్ చొప్పున రెండు సెషన్లలో విద్యార్థులు
క్లాసులకు హాజరయ్యేలా ప్లానింగ్ రెడీ చేస్తున్నారు అధికారులు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే పాఠశాలలను కాస్త ముందుగా ప్రారంభించనున్నారు.
0 Komentar