విద్యాశాఖలో జిల్లాకో
ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (RJD’s) నియామకం..!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో
కీలక మార్పులు చోటుచేసుకోబోవుతున్నాయి. విద్యాశాఖలోని కొన్ని అంశాలను జిల్లాల్లోని
సంయుక్త కలెక్టర్లకు ఇవ్వడంపై కసరత్తు కొనసాగుతోంది. అలాగే ప్రస్తుతం కడప, గుంటూరు, కాకినాడ,
విశాఖపట్నం ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉండగా ప్రతి జిల్లాకూ
ఆర్జేడీని నియమించేందుకు రగం సిద్ధమైంది. దీనికి సంభందించిన దస్త్రం పాఠశాల
విద్యాశాఖ నుంచి ఆర్థిక శాఖకు చేరింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
0 Komentar