అధిక పొట్టను తగ్గించే ఆహార నియమాలు
కొంత మందికి ఆహారపు అలవాట్ల వలన, వయస్సు
వలన మరికొంత మందికి వాళ్ల శారీరక తత్వం బట్టి పొట్టలో కొవ్వు, తొడలలో కొవ్వు ఎక్కువగా చేరుతూ ఉంటుంది. పొట్టలోని కొవ్వు శరీరానికి మరియు మన
ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండె జబ్బులు, స్ధూలకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు కొన్ని రకాల సూచనలు పాటిస్తే కచ్చితంగా
పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కొద్దిగా అయినా తగ్గడానికి చాలా అవకాశాలున్నాయి.
అల్పా హారము తప్పనిసరి
ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి. ఉదయము నుండి సాయంత్రమువరకూ
చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది ఆ అల్పాహారమే. అల్పాహారమువలన శరీరము బరువు, ఆకృతి అదుపులో ఉంటాయి .
ఉప్పు తగ్గించాలి
ఎవరైతే తక్కువ ఉప్పు తింటారొ వారు లావెక్కరు . ఉప్పుకు శరీరములో నీటిని, కొవ్వును నిలవా చేసే గుణము ఉన్నది . ఫలితము వా
బరువు పెరుగుతారు .చలాకీతనము తగ్గుతుంది. అందుకే రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా
ఉంటే పొట్ట తగ్గుతుంది.
మూడు పూట్లా తినండి
బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్
ప్రమాదకరము . లావు తగ్గాలన్నా, పొట్ట
కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి . ఆ తినే ఆహారము విషయములో జాగ్రత్తపడాలి .
శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన
ఆహారము తీసుకోవాలి.
నడక అవసరము
నదక సహజ వ్యాయామము . ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా నడాల్సిందే .
1.5 కిలోమీటర్లు పావుగంట కాలములో వేగముగా నడిచేవిధముగా సాధనచేయాలి . రోజుకు సుమారు
3 కి.మీ నడిస్తే మంచిది.
ఎత్తుపల్లాల్లో పరుగు
కాళ్ళకు బలాన్నిస్తుంది పరుగు . కొవ్వును బాగా కరిగిస్తుంది. ఎత్తు
పల్లాలో కొండలమీదికి నడక, పరుగు, ఎక్కి దిగ గలిగితే పాదము నేలమీద తాకే సమయము బాగా
తగ్గుతుంది. ఫ్యాట్ కరిగేందుకు దోహదపడుతుంది . గుండెజబ్బులున్నవారు కొండలెక్కడము మంచిది
కాదు .
వేపుళ్ళు వద్దు
రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు .. కాని ఆరోగ్యరీత్యా
వేపుడు కూరలు మంచివి కావు . ఉడికించిన కూరలు తింటేనే శరీరరూపము మెరుగ్గా ఉంటుంది. కాబట్టి
కూర లన్నింటినీ సగం మేర ఉడికించి తర్వాత కొంద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి.
సాయంకాల సమయ ఆహారము
సాయంకాలములో ఏదో ఒకటి తినాలి . ఆకలితో ఉండకూడదు . ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు తినాలి. నూనెలో ముంచి తేలిన చిప్స్, నూడిల్స్, కురుకురేల వంటివి అస్సలు తినకూడదు .
నీరు బాగా త్రాగాలి
నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి . నీరు తాగడము వలన ఆహారము
తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి అవసము . తగినంత ఉంటే
ఆలోచనలు స్పస్టముగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడములో అటు ఇటు అవ్వదు .
శ్వాసతీరు మార్చుకోవడము
సైనికులకు శ్వాస వ్యాయామము ప్రత్యేకముగా చేయిస్తారు. శ్వాసక్రియను చాతీకి
పరిమితం చేయక కిందనున్న పొట్టను పైకిలాగుతూ శ్వాసను పీల్చి వదలడము చెయ్యాలి. ఇది పరుగెడుతున్నప్పుడు
చేయాలి . ఉదరబాగముతో కలిపిన శ్వాసక్రియవల్ల శరీర రూపములో మార్పువస్తుంది . పొట్ట లోపలికి
పోతుంది.
బరువుతో పరుగు
పరుగు చక్కని వ్యాయామము . అయితే పొట్ట బాగా తగ్గాలంటే వీపుకు ఏధనా
బరువును కట్టుకొని పరుగెట్టడము మంచిది. సైనికులు తమ అవసరాలకు సంబంధించిన సామానులతో
కూడిన సంచి వీపుకు తగిలించుకొని పరిగెడు తుంటారు దీనివలన కొవ్వు కరిగిపోతుంది. కొత్తగాకొవ్వు
చేరనివ్వదు .
పరుగు తీరు
మేము ప్రతిరోజూ పరిగెడుతున్నాము . . . కాని శరీరములో మార్పు కనిపించడము
లేదంటారు. పరిగెత్తేటపుడు త్లల ఎత్తి ఉంచాలి . ముందుకు చూస్తూఉండాలి . వీపును వెనక్కి
నెట్టినట్లుగా, మోచేతులు శరీరానికి పక్కగా
ఉంచి పరుగెత్తాలి .దీనివల్న పరుగు వేగము అందుకుంటుంది ... కొవ్వు కరిగే అవకాశాలు ఎక్కువ
అవుతాయి.
తగినంత నిద్ర
నిద్ర వలన రెండురకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసటనుండి తేరుకుంటాయి.
నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. కొవ్వు అదనము
పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది.
వ్యాయామములో మార్పు
ఒకే తరహా కసరత్తు నెలల తరబటి చేయకుండా రకరకాల పద్ధతులలో వ్యాయామము మార్చి
చేస్తూ ఉండాలి .దీనివలన కొత్త ఉత్సాయము, కొత్త లాభాలు శరీరానికి చేర్చిన వారవుతారు.
రిలాక్స్ అవ్వాలి
నిరంతము టెన్సన్ మంచిది కాదు . ఒత్తిడిలో ఉన్నవారు ఆహారము అధికముగా
తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పనిచేస్తూ
మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. గాబరా గాబరగా ఏదో ఒకటి తింటూ ఎల్లప్పుడు పని
ఒత్తిడిలో ఉండకూడదు . వీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ నే తీసుకోవడము జరుగుతూ ఉంటుంది.
. . ఇవి కొవ్వును అధికం చేస్తాయి.
మరికొన్ని ఆహార నియమాలు
>ఉదయం పూట లేటుగా లేచే వాళ్లు ఎక్కువగా ఊబకాయానికి
గురవుతూ ఉంటారని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల మీరు వీలైనవరకు ఉదయం లేవడానికి
ప్రయత్నించండి.
> ఆయిల్ తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల మీలో కొవ్వు పేరుకుపోతుంది.
అలాగే గుండె జబ్బులకు గురవుతారు.
> నిమ్మరసం మన కాలేయం లో ఉండే వ్యర్థ పదార్థాల్ని బయటికి పంపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం మరియు తేనెని కలపుకుని
ఉదయాన్నే తాగితే జీవక్రియను మెరుగు పరిచి శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది.
>పొట్టలో ఉన్న గ్యాస్ సమస్య ఉన్న కొంతమందిలో పొట్ట ఎత్తుగా ఎక్కువగా ఉన్నట్లు
కనిపిస్తుంది. దీని కొరకు పుదీనా వాడటం వలన
అందు లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చక్కగా పనిచేస్తుంది.
> కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన కొన్ని
రకాల స్వీట్లన్ల తింటూ ఉంటారు. దీని వల్ల పొట్ల దగ్గర కొవ్వు అలాగే ఉండిపోతుంది.
> ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా
మంచిది. దీని వల్ల ఈజీగా కొవ్వు కరిగిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ ఫుడ్
బాగా ఉపయోగపడుతుంది.
>యోగా కొన్ని రకాల ఆసనాలు కూడా మీ పొట్ట చుట్టూ
పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది.
>వెల్లుల్లి మీరు రోజూ తీసుకునే ఆహారంలో వెల్లుల్లి
కచ్చితంగా ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి బాడీలోని కొవ్వును కరిగిస్తుంది.
> చేపలు మీ బాడీలోని కొవ్వును తగ్గించగలవు.
వారానికొకసారైనా మీరు మీ మెనూలో చేపలుండేలా చూసుకోండి.
> క్యాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయలాంటి
కూరగాయలు ఎక్కువగా తినడం మంచిది. వీటి వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.
> పాలు, పాల సంబంధిత పదార్థాలలో ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. వీటిని రెగ్యులర్
గా తీసుకుంటూ ఉండడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది.
>అల్లం టీ తీసుకోవడం ద్వారా మన ఒంట్లో వేడిని సహజ సిద్ధంగా పెంచి తద్వారా
మన శరీరంలో అధిక కేలరీలు మరియు కొవ్వును తగ్గిస్తుంది.
>బాదంపప్పు తింటే బరువు పెరుగుతారని చాలా మందికి అపోహ ఉంది, కానీ అది నిజం కాదు. బాదం పప్పులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ పొట్ట
చుట్టూ ఉండే కొవ్వు కరిగిస్తుంది.
>అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది.
>నిద్ర సరిగా లేనప్పుడు, మీ శరీరంలో తక్కువ లెప్టిన్
ఉంటుంది. ఎక్కువ మొత్తాల్లో ఘ్రెలిన్, తక్కువగా లెప్టిన్ ఉండటం వలన బరువు పెరుగుతారు, పొట్టలో ఫ్యాట్ చేరుతుంది. అందువల్ల రెగ్యులర్ గా సరైన సమయానికి నిద్రపోతూ
ఉండడం కూడా చాలా మంచిది.
0 Komentar