9వ
తరగతి నుంచి ఇంటర్ వరకూ ప్రతి విద్యార్థికీ స్మార్ట్ ఫోన్
సాంఘిక సంక్షేమ
గురుకులాల పాలకమండలి భేటీలో నిర్ణయం
9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే ప్రతి
విద్యార్థికీ స్మార్ట్ ఫోన్ ను అందివ్వాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ
గురుకులాల పాలకమండలి భేటీలో నిర్ణయించింది. కరోనా వ్యాప్తి
దృష్ట్యా ఆన్‌లైన్ తరగతులు నిర్వహణ కు వీలుపడేలా ఒక్కొక్క విద్యార్ధికి రూ.5 వేల నుంచి రూ.6
వేల విలువగల స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనున్నది. సొసైటీ పరిధిలోని గురుకులాల్లో చదివే 60వేల మంది విద్యార్థుల్లో కొద్ది మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు
అందుబాటులో ఉన్నాయని, ఇతర విద్యార్థులకు ఎలాంటి
ఆటంకాల్లేకుండా బోధన అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ
తెలిపింది. విద్యార్దులు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం పొందుటకు 189 గురుకులాల్లో ఆంగ్ల ల్యాబ్‌ల
ఏర్పాటు చేయనున్నారు. అలాగే విశాఖపట్నంలో 2, నెల్లూరు,
తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున
కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
0 Komentar