Solar Eclipse / Surya Grahanam on 21st June
జూన్ 21న సూర్యగ్రహణం -గ్రహణం సందర్భంగా
'రింగ్ ఆఫ్ ఫైర్' గా కనిపించనున్న సూర్యుడు
నేడు (జూన్ 21న)
సంభవించే సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు 'రింగ్ ఆఫ్ ఫైర్'గా కనిపించనున్నాడు. గ్రహణం వేళ సూర్యుడిచుట్టూ ఉంగరం ఆకృతిలో వెలుగు
కనిపించడమే “రింగ్ ఆఫ్ ఫైర్” అంటారు.
రాజస్తాన్లోని ఘర్సానాలో ఉదయం 10.12 గంటలకు ప్రారంభమై,
11.49 గంటలకు వలయాకార రూపు దాల్చి, 11.50
గంటలకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ముగీయనున్నది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్య
గ్రహణమేనని, గత సంవత్సరం డిసెంబర్ 26న
కనిపించినంత స్పష్టంగా ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించదని బిర్లా ప్లానెటోరియం
డైరెక్టర్ వెల్లడించారు.
ఈసారి వచ్చే
గ్రహణం మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కనిపించదు. ఉత్తర భారత దేశంలో మాత్రం
సంపూర్ణంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.23కి గ్రహణం
మొదలవుతుంది. మధ్యాహ్నం 12.05కి చందమామ సరిగ్గా భూమి,
సూర్యుడి మధ్యకు వస్తుంది. ఆ తర్వాత గ్రహణం వీడిపోతూ మధ్యహ్నం 1.51కి పూర్తిగా తొలగిపోతుంది. తెలంగాణలో ఈ గ్రహణం ఉదయం 10.14కి మొదలవుతుంది. ఉదయం 11.55కి చందమామ సరిగ్గా భూమి,
సూర్యుడి మధ్యకు వస్తుంది. ఆ తర్వాత గ్రహణం వీడిపోతూ మధ్యాహ్నం 1.44కి పూర్తిగా తొలగిపోతుంది.
సూర్యగ్రహణం వేదపండితుల ముఖ్య
సూచనలు..
DOWNLOAD
సూర్యగ్రహణం Live లో చూడండి ..
0 Komentar