Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC 10th Class certificate corrections guidelines and required documents



SSC సర్టిఫికెట్లలో తప్పుల సవరణ
సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ లో (SSC) ఉన్న తప్పులు సరి చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించింది. ఇన్నాళ్లూ సర్టిఫికెట్ లో తప్పుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు ఇకపై వాటిని సరిచేసుకునే అవకాశం లభించింది. తప్పులు సవరించుకొనేందుకు అభ్యర్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు మార్గదర్శకాలు జారీ చేశారు.
తప్పులు సరి చేసుకోవాల్సిన వారు విధిగా ఎనిమిది రకాల పత్రాలు సమర్పించాల్సి ఉంది. తప్పుల సవరణ ప్రక్రియ సాధారణంగా జరుగుతున్నప్పటికీ, డీఈఓలు తమకొచ్చిన అర్జీలను నేరుగా విద్యాశాఖ కమిషనర్ కు పంపిస్తున్నారు. దీనివల్ల పెండింగ్ దరఖాస్తులు పెరుగుతుండటంతో ఇలాంటి తప్పుల సవరణ అర్జీలను హెచ్ఎం స్థాయిలోనే ఫిల్టర్ చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఎస్ఎస్సీ సర్టిఫికెట్లలో ఉన్న తప్పులు సరి చేసుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే, దానిని హెచ్ఎం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తమకు పంపించాలని కమిషనర్ స్పష్టం చేశారు.  ఎస్ఎస్ సీ సర్టిఫికెట్ లో తప్పుల సవరణకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మాను పూర్తి చేసిన అనంతరం డీఈఓ సంతకం చేసి, సీల్ వేశాకే కమిషనరేటకు పంపించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. దరఖాస్తులు సరిగా లేకుంటే, అక్కడే తిరస్కరించే అధికారాన్ని హెచ్ఎంలకు కట్టబెట్టారు.
టెస్త్ సర్టిఫికెట్లోని తప్పుల సవరణకు అభ్యర్థులు తమ అడ్మిషన్ దరఖాస్తు, రికార్డుషీటు, టీసీ, ఒరిజినల్ సర్టిఫికెట్, నామినల్ రోల్స్, తప్పు జరగడానికి కారణంపై విశ్లేషణ, తప్పు ఎక్కడ జరిగిందో హెచ్ఎం నివేదిక, ఒరిజినల్ పుట్టిన తేదీ సర్టిఫికెట్ ను దరఖాస్తుతో జత చేసి పంపించాలని కమిషనర్ సూచించారు.
ఇకపై ఇలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఇందు కోసం నామినల్ రోల్ లను రూపొందించే సమయంలోనే పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Required documents
1. Admission Application
2. Extract from the admission register
3. Record Sheet
4. Transfer Certificate
5. Original SSC Certificate
6. Extract from the Nominal rolls(MNR&PNR)
Y. Explanation of the concerned.
3. Report of the HM concerned (Should mentioned where the mistake occurred i.e. is it Clerical / Parental )
9. Original Date of Birth Certificate.
10. Xeroxes should be clear and visible.

Previous
Next Post »
0 Komentar

Google Tags