Sudden Loss of
taste and smell may be indicators of COVID-19
ఒక్కసారిగా రుచి, వాసన
కోల్పోతే.. కరోనా కావచ్చు- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
శాఖ
కరోనా రోగులకు
చికిత్స అందిస్తున్న విధానాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ
సంక్షేమ శాఖ ‘క్లినికల్ గైడెన్స్ ఫర్ మేనేజ్‌మెంట్ ఆఫ్
కరోనా’ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. జలుబు, జ్వరం, దగ్గు ఇప్పటివరకు ఉన్న ప్రధాన లక్షణాలతోపాటు
మరికొన్ని లక్షణాలతో కొవిడ్-19 డాక్యుమెంట్ తీసుకువచ్చారు.
జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబారడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కరోనా
లక్షణాలుగా పేర్కొంటున్నారు. మరోవైపు వయసు పైబడ్డ వారిలో, రోగ
నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ లక్షణాలకు బదులుగా చికాకుగా ఉండటం, ఒక్కసారిగా మంచం పైనుంచి లేవలేని పరిస్థితికి వెళ్లడం, సోయి లేకుండా పోవడం, విరోచనాలు ఉంటాయి.
వీటికి అదనంగా
కేంద్రం మరికొన్ని లక్షణాలను కూడా కొవిడ్-19 జాబితాలో
చేర్చింది. అకస్మాత్తుగా రుచి, వాసన చూసే శక్తిని కోల్పోతే అది కరోనా కావొచ్చని కేంద్రం పేర్కొన్నది.
కరోనా వైరస్ సోకిన పిల్లల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపించవు. వారికి త్వరగా నయమయ్యే
అవకాశం ఉన్నా.. ఎక్కువ వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది.
రోగి నుంచి వైరస్
సోకుతుందిలా..
ఇక, కరోనా
వ్యక్తి నుంచి వ్యక్తికి నేరుగా ఎలా సోకుతుందో కూడా ఈ డాక్యుమెంట్ లో
నిర్వచించారు. రోగికి వ్యాధి లక్షణాలు ప్రారంభమయ్యే రెండ్రోజుల ముందు నుంచి..
లక్షణాలు మొదలైన 8 రోజుల వరకు ఇతరులకు సోకే వీలుంటుంది.
మొత్తంగా 10 రోజుల పాటు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువని
కేంద్రం స్పష్టం చేసింది. ఓ వ్యక్తితో
సన్నిహితంగా మెలగడం, ప్రధానంగా ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లతో వైరస్ వ్యాపిస్తుందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా.. అతడి ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లు
ఏదైనా ప్రదేశంపై పడితే, ఆ ప్రదేశాన్ని ఎవరైనా తాకి, ఆ చేతిని కళ్ల వద్ద, ముక్కు, నోటి
వద్ద తాకించినా కరోనా సోకుతుందని వివరించారు.
0 Komentar