మధుమేహ వ్యాధి లక్షణాలు
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో
డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి
తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక
గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. మధుమేహం
వలన ఎక్కువ శాతం అన్ని అవయవాలకు అనారోగ్యం కలిగే అవకాశం వుంది.
మధుమేహం.. చాపకింద నీరులా సోకే వ్యాధి. మరి, దీన్ని గుర్తించడం ఎలా? మధుమేహ వ్యాధి లక్షణాలు ఏమిటి ?
>తరచూ మూత్రం రావడం.
>ఆకలి ఎక్కువగా వుండి - చాలా మార్లు, ఎక్కువగా ఆహారం తీసుకోవడం
>సాధారణంకన్నా ఎక్కవగా నీరు దప్పికకావడం -
ఎక్కువగా నీరు త్రాగడం
>కొంతమందిలో బరువు తగ్గడం
>గాయం తగిలినచో సరిగా మానకపోవడం - త్వరగా
తగ్గకపోవడం.
>నీరసంగా, నిస్త్ర్రాణంగా వుండడం, స్త్ర్రీలలో
అసాధారణంగా తెల్లబట్ట కావడం
>తరచుగా చర్మవ్యాధులు రావడం
>కాళ్ళు - చేతులు ముఖ్యంగా పాదాలు అరచేతులు
తిమ్మిరిగా వుండడం.
>ఏదైనా పని చేయాలన్న - చికాకు, అసహనము కలిగి త్వరగా అలసిపోవడం
>చూపు మందగిస్తుంది.
>పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు
>కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు,
చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు
>శృంగార కోరికలు సన్నగిల్లడం
పైన సూచించిన లక్షణాలలో కొన్ని సాధారణం గా కూడా
కనిపించే అవకాశం ఉన్నది. అయితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. ఈ
వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు
తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.
0 Komentar