తమిళనాడులో 10వ
తరగతి పరీక్షలు రద్దు
కరోనా మహమ్మారి
విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ
ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తెలంగాణ బాటలోనే తమిళనాడు కూడా
నడిచింది. పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ మంగళవారం ప్రకటించింది. దీంతో టెన్త్
పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతులకు వెళ్లనున్నారు. విద్యార్ధుల
క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాల ఆధారంగా 80శాతం మార్కులు, అటెండెన్స్ తో మిగితా 20శాతం గ్రేడులను తమిళనాడు విద్యాశాఖ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 9.50
లక్షల మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. ఇక,
11వ తరగతికి సంబంధించి ఇంకా జరగాల్సి ఉన్న మిగిలిన సబ్జెక్టుల
పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు అక్కడి సర్కారు ప్రకటించింది.
0 Komentar