Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teacher transfers: New Staff Pattern Proposed

Teacher transfers: New Staff Pattern Proposed


Staff Pattern Proposed for Primary & UP Schools
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు మార్గదర్శకాలు విడుదల
బడికి ఇద్దరు గురువులు: ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండవు
సర్దుబాటు అనంతరం బదిలీలు
>ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 60లోపు ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు. 
>ఈ విద్యా సంవత్సరం నుంచి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండవు.  
>విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 
>ఫిబ్రవరి 29వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. 
>అనంతరం బదిలీలు చేపట్టనున్నారు.
సర్దుబాటు ఇలా చేస్తారు..
>విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే అక్కడి పోస్టులను పిల్లలు అధికంగా ఉండే పాఠశాలకు బదిలీ చేస్తారు. 
>8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసినవారికి బదిలీ తప్పనిసరి. ఆయా పాఠశాలల్లోని సీనియర్‌ ఉపాధ్యాయులు వద్దంటే జూనియర్‌కు అవకాశం కల్పిస్తారు. 
>వీరికి అదనంగా పాయింట్లు కేటాయిస్తారు. 150 మంది విద్యార్థులు ఉంటేనే LFL ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఉంటుంది. 
>ఇంతకంటే తక్కువ ఉంటే ఎస్జీటీగా పరిగణించి పోస్టును సర్దుబాటు చేస్తారు.
>60లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు ఉంటారు. 
>గతంలో 61-80 విద్యార్థులకు ముగ్గురు ఎస్జీటీలు ఉంటే ఇప్పుడు 61-90కి ముగ్గురు ఉంటారు.
>200 మంది విద్యార్థుల తర్వాత ప్రతి 40 మందికి అదనంగా ఎస్జీటీని నియమిస్తారు.
>ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-7తరగతుల్లో 100మంది విద్యార్థులు ఉంటే నలుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉంటారు.
>6-8 తరగతుల్లో 140మంది ఉంటే ఆరుగుర్ని కేటాయిస్తారు.
>ఉన్నత పాఠశాలల్లో 240 మంది విద్యార్థులకు 9మంది ఉపాధ్యాయులను నియమిస్తారు.
>1200-1240 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రతి 40 మందికి ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టును మంజూరు చేస్తారు.
>441-480మంది విద్యార్థులు ఉన్నచోట్ల క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు.
Staff Pattern Proposed for High Schools
ఈ సంవత్సరం జరపబోయే రేషనలైజేషన్ మార్గదర్శకాలు !
>PSలో 1-60మంది విద్యార్ధులకు ఇద్దరు టీచర్స్ ..!                                  
>UP(6&7)లో 1-100 నలుగురు..!                                                       
>UP(6,7&8) లో 1-100 ఆరుగురు..!
>HS లో 240 వరకు 9 మంది..
>6 ,7 తరగతుల UP పాఠశాలలకు తెలుగు , హిందీ , సోషల్ , గణితం/PS ఉపాధ్యాయులు (Roll upto 100)
>8వ తరగతి కూడా ఉంటే అదనంగా ఆంగ్లం , BS ఉపాధ్యాయులు (Roll upto 140)
>ప్రతి ప్రాధమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు (Roll up to 60)
>తదుపరి ప్రతి 30మందికి ఒక ఉపాధ్యాయుడు అదనం
>PS HM పోస్టులు కనీసం 151 రోలు ఉన్న పాఠశాలలకు మాత్రమే
ఇవి కేవలం ప్రతిపాదనలు మాత్రమే, విద్యాశాఖ  ఉత్తర్వులు వెలువరించవలసి ఉన్నది.. 

Previous
Next Post »
0 Komentar

Google Tags