జూలైలో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు
మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసు ప్రాతిపదికగా త్వరలో ఉత్తర్వులు
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మేరకు జూలైలో బదిలీలు చేపట్టే దిశగా పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. జూలై నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వెబ్ ఆధారితంగా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు.
ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను, అలాగే ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. లాంగ్ స్టాండింగ్ కటాఫ్ డేట్‌ను ఈ నెల 30 వరకూ తీసుకుంటారని తెలుస్తోంది. ఉపాధ్యాయుల మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసును ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేటగిరీల టీచర్లకు ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు మాత్రం కొనసాగుతాయి.
Telangana or Andra pradesh
ReplyDelete