తెలంగాణలో 10వ
తరగతి పరీక్షలు లేకుండానే పాస్..!
కరోనా వల్ల
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు.. పరీక్షలు
నిర్వహించకుండానే పైతరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను
ఆదేశించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన
మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని విద్యార్థులను పైతరగతికి ప్రమోట్
చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
గ్రేడింగ్ ఇలా..
పదో తరగతి
పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్
ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి టెన్త్ విద్యార్థులంతా పాస్ కానున్నారు.
రాష్ట్రంలో 2014లో అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)
ప్రకారం 9, 10 తరగతుల్లో త్రైమాసిక, అర్ధ
వార్షిక, వార్షిక పరీక్షల విధానాన్ని తొలగించి నిర్మాణాత్మక
మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం విధానం కొనసాగుతోంది.
ఒక విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏలు, రెండు ఎస్‌ఏలు
నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
అలాగే 2015లో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని
ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 20 మార్కులు ఇంటర్నల్స్‌కు
ఇచ్చి 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్నల్స్‌లో
ఒక్కో ఎఫ్‌ఏకు 20 మార్కుల (ప్రతి సబ్జెక్టులో) చొప్పున
నాలుగు ఎఫ్‌ఏలు ఉంటాయి. ప్రతి ఎఫ్‌ఏ మార్కులను (20
మార్కులను) ఐదు మార్కులకు (ప్రతి సబ్జెక్టులో) పాఠశాలలు కుదిస్తాయి. ఇలా నాలుగు
ఎఫ్‌ఏలలో మార్కులను 20 నుంచి 5
మార్కులకు కుదిస్తాయి. అంటే నాలుగు ఎఫ్‌ఏలు.. ఒక్కో దానికి 5
మార్కుల చొప్పున 20 అవుతాయి. ప్రతి సబ్జెక్టులో అలా వచ్చిన 20 మార్కులను విద్యార్థుల ఇంటర్నల్ మార్కులుగా పాఠశాలలు పదో తరగతి పరీక్షల
విభాగానికి పంపుతాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 2019
జూలై, ఆగస్టు, నవంబర్, 2020 జనవరిలలో ఎఫ్‌ఏలను నిర్వహించగా ఆయా పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా
ఇంటర్నల్ మార్కులను స్కూళ్లు పరీక్షల విభాగానికి పంపాయి.
100 మార్కులుగా ఇంటర్నల్స్ మార్కులు పరిగణన..
ఇప్పుడు ఒక్కో
విద్యార్థికి ప్రతి సబ్జెక్టలో ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక 20
మార్కుల్లో విద్యార్థులకు ఎంత శాతం మార్కులు వచ్చాయో వాటి పర్సంటేజీ ప్రకారం
మార్కులను ఇస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి గణితంలో ఇంటర్నల్ మార్కులు 20కి 20 వేసి ఉంటే అతనికి గణితంలో 100 మార్కులతో ఏ–1 గ్రేడ్ (10
గ్రేడ్ పాయింట్ యావరేజ్–జీపీఏ) వస్తుంది. అలాగే అన్ని
సబ్జెక్టుల్లో ఏ–1 వస్తే 10/10 జీపీఏ
వస్తుంది. ఒకవేళ ఇంటర్నల్‌లో 18 మార్కులే వస్తే అతనికి 90 మార్కులు వచ్చినట్లు లెక్క. దాని ప్రకారం ఆ సబ్జెక్టులో ఏ–2 గ్రేడ్‌తో 9 పాయింట్ జీపీఏ వస్తుంది. మార్కుల
పర్సంటేజీ ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్ కేటాయిస్తారు.
మరో విధంగా
చెప్పాలంటే..
0 Komentar