Telangana government decision to teach online lessons to students
తెలంగాణ విద్యాశాఖ
కీలక నిర్ణయం..!
ఆన్‌లైన్
తరగతులను నిర్వహించడానికి సన్నాహాలు
ప్రస్తుత పరిస్థితుల్లోనూ
విద్యా సంస్థలను ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థులు ఈ విద్యా
సంవత్సరంలోనూ నష్టపోయే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విద్యాశాఖ
కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మరింతగా నష్టపోకుండా ఆన్‌లైన్ తరగతులను
నిర్వహించాలని భావించింది. అందులో భాగంగానే తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేకంగా
యూట్యూబ్ ఛానల్‌ను సైతం ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ డీఈఓ తెలిపారు.
జూన్ చివరి వారం
నుంచి యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. మొదటగా పదో
తరగతి విద్యార్థులతో ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన తరగతులకు నిర్వహించేలా ప్రణాళిక
రూపొందించారు. రికార్డెడ్, లైవ్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు
పాఠాలను బోధించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు త్వరలోనే ఆన్‌లైన్ పాఠాల కోసం ఓ
వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఆయా
రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పేందుకు రంగం సిద్ధం
చేస్తోంది.
0 Komentar