తహసీల్దార్
వ్యవస్థలో సమూల మార్పులు
తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం తహసీల్దార్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. గతంలో ఉన్న భూ
వ్యవహారాలు మరియి రేషన్ వ్యవహారాల్లోనూ కోత విధించనున్నది. రేషన్‌కార్డులు
జారీచేసే అధికారం, రేషన్‌షాపుల పర్యవేక్షణ, రైసుమిల్లులపై అజమాయిషీ, రైతు సంబంధ వ్యవహారాల్లోనూ తహసీల్దార్ల పాత్రను
పరిమితం చేస్తోంది. జనగణన, పశుగణన వంటి అదనపు భారాల నుంచి
కూడా విముక్తి కల్పించ బోతోంది. ఈ మేరకు తహసీల్దార్లకు ఉన్న ప్రధానమైన 44 అధికారాల్లో 20 మాత్రమే వారి పరిధిలో కొనసాగిస్తూ,
17 అధికారాలను వ్యవసాయ, పశుసంవర్థక, పోలీసు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్
శాఖలకు బదలాయించబోతోంది. అలాగే 7 అధికారాలు రద్దు చేయనున్నారు.
తహసీల్దార్ల
ప్రతిపాదిత విధులు, బాధ్యతలు
> మండల
రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపై పర్యవేక్షణ, సమన్వయం
> సాధారణ
విచారణలు
> వీఐపీల
పర్యటనల ప్రొటోకాల్ విధులు
> కుల, ఆదాయ,
వాల్యూయేషన్, స్థానికత, న్యాయబద్ధమైన
వారసుల సర్టిఫికెట్ల జారీ
> ఎగ్జిక్యూటివ్
మేజిస్ట్రేట్ హోదాలో జ్యూడీషియల్ అధికారాలు, భూసేకరణాధికారి (ఎల్‌ఏవో)
> రోడ్డు, రైల్వే
కార్యకలాపాలకు సంబంధించిన ప్రొటోకాల్ డ్యూటీ
> వెట్టి
కార్మికుల విముక్తి చట్టం అమలు
> రెయిన్‌గేజ్
మీటర్ల నిర్వహణ
> నీటి వనరులు, నీటి
పరివాహక ప్రాంతాల పర్యవేక్షణ
> వ్యవసాయేతర
రంగాలకు నీటి వనరుల కేటాయింపులపై అధికారం
> రెవెన్యూ
రికవరీ చట్టం కింద ప్రభుత్వ బకాయిలు వసూలు చేయడం
> గ్రామ
పద్దుల పరిశీలన
> ప్రకృతి
విపత్తుల నిర్వహణ, పునరావాసం
> సాధారణ
భూసేకరణ
> సాధారణ ఎన్నికల అసిస్టెంట్
రిటర్నింగ్ ఆఫీసర్
> ఓటర్ల
జాబితా రూపకల్పన
> ప్రజారోగ్యం, అంటువ్యాధుల
నివారణ బాధ్యతలు
> చెట్లపై
హక్కుల జారీ
> రివాల్వర్ లైసెన్సులు, పేలుడు సంబంధిత అనుమతుల లైసెన్సుల తనిఖీ
> భూ ఆక్రమణల
చట్టం కింద చర్యలు
రద్దు కానున్న
అధికారాలు
> సర్వే సబ్
డివిజన్ నంబర్ల జారీ
> ఉప్పు భూమి
లీజులు,
అద్దె వసూళ్లు
> సర్వే
హద్దురాళ్ల తనిఖీ
> ఆక్రమణదారులకు
బీ–మెమోల జారీ
> వ్యవసాయ, ఇళ్ల
స్థలాల అసైన్‌మెంట్
> హోమ్
స్టెడ్ యాక్ట్ కింద పట్టాల జారీ
> టెనెన్సీ
యాక్డు
0 Komentar