చెక్ బౌన్స్
నేరం ఇక క్రిమినల్ నేరం కాబోదు..?
చిన్నపాటి
నేరాలను డీక్రిమినలైజ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు
చెక్ బౌన్స్ లాంటి ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పించడంపై కేంద్ర
ప్రభుత్వం దృష్టి సారించింది. చెక్ బౌన్స్, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన
మొదలైన చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు
రూపొందించింది. ఇందుకోసం 19 చట్టాలకు తగు విధంగా సవరణలు చేయనుంది. వీటిపై సంబంధిత
వర్గాలు జూన్ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది.
వీటి ఆధారంగా నిర్దిష్ట సెక్షన్ పరిధిలో ఏ నేరాలను క్రిమినల్ నేరాల కింద
కొనసాగించాలి, వేటిని డీక్రిమినలైజ్ చేయొచ్చు అన్నది ఆర్థిక
సర్వీసుల విభాగం నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్
యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద
ఖాతాలో తగిన బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ అయితే దాన్ని జారీ చేసిన వ్యక్తి నేరం
చేసినట్లుగా పరిగణించి రెండేళ్ల దాకా జైలు శిక్ష లేదా చెక్ పరిమాణానికి రెట్టింపు
పెనాల్టీ విధించవచ్చు. లేదా జైలుశిక్ష, జరిమానా రెండూ
విధించవచ్చు.
0 Komentar