పెను ప్రమాదకర
దశలోకి ప్రపంచం-WHO
ప్రపంచవ్యాప్తంగా
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం పెను ప్రమాదకర దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)
హెచ్చరించింది. కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని, గురువారం
ఒక్కరోజే 1,50,000 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకావటం,
అందులో సగానికి పైగా అమెరికాలోనివి కావటంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా
ఇప్పటి వరకు ఒక్క రోజు వ్యవధిలో రికార్డయిన కేసుల్లో ఇదే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా
ఈ వైరస్ సోకిన వారి సంఖ్య తొలి లక్షను చేరుకునేందుకు 67
రోజులు పట్టిందని గుర్తు చేశారు. తర్వాతి లక్షను చేరుకునేందుకు కేవలం 11 రోజులు పట్టిందన్నారు. ఆపై నాలుగు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగిందన్నారు.
కరోనా వ్యాక్సిన్‌ను
కనిపెట్టడం అసాధ్యం కానప్పటికి అదో కష్టతరమైన ప్రయాణమని అన్నారు. ఈ మహమ్మారిని
అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని టైడ్రోస్ అధనోమ్ తేల్చి
చెప్పారు. ఇప్పటికే విధించిన లాక్ డౌన్లతో ప్రజలు విసిగిపోయారన్నారు. చాలా దేశాలు
ఆర్ధిక వ్యవస్థల్ని తెరిచే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కానీ, వైరస్
వ్యాప్తి మాత్రం అంతకంతకూ పెరుగుతోందన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం
వంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
0 Komentar